తాజా వార్తలు

Saturday, 5 December 2015

వరదల నుంచి తేరుకుంటున్న తమిళనాడు

వరద సృష్టించిన బీభత్సం నుంచి తమిళనాడు తేరుకుంటున్నది. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటున్నది. వరదనీటి నుంచి బయట పడ్డ ప్రాంతాల్లో మామూలు పరిస్థితులు ఏర్పడుతున్నా.... లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రం ఇంకా తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. ఐదారు అడుగుల నీటి మట్టం నెలకొనడంతో డాబాలపైనే ఉంటున్నరు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహా త్రివిధ దళాలు వరదలో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్‌ ను కొనసాగిస్తున్నాయి. చెన్నై లో లోతట్టు ప్రాంతాల ప్రజలను బోట్ల ద్వారా సహాయక శిబిరాలకు చేర్చారు. ఇప్పటి వరకు 16 వేల మందిని రక్షించారు. లక్ష మందికి పైగా జనాలను పునారవాస కేంద్రాలకు తరలించారు. పునరావస కేంద్రాల్లో వైద్య సదుపాయాన్ని ఏర్పాటుచేశారు. హెలికాప్టర్లు, ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా ఆహార ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు. వరదలు తగ్గుముఖం పట్టినప్పటికి చెన్నై వాసులు మంచి నీటికి కటకట కొనసాగుతూనే ఉంది. నిత్యవసర వస్తువులుఇంకా అందుబాటులోకి రాలేదు. మరోవైపు రవాణా, విద్యుత్, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను కొంత మెరుగుపర్చారు. నగరంలో 50 శాతం వరకు విద్యుత్ ను పునరుద్దరించారు. కమ్యూనికేషన్‌ వ్యవస్థ 80 శాతం వరకు మెరుగుపడింది. చాలా ప్రాంతాల్లో విద్య, వైద్యం, బ్యాంకింగ్ కార్యకాలాపాలు తిరిగి ప్రారంభం కాలేదు. చెన్నై ఎయిర్‌ పోర్ట్‌ లోనూ కొన్ని విమాన సర్వీసులను ప్రారంభించారు. నేవీ విమానాల కోసం రన్‌ వే సిద్ధం చేశారు. ఎయిర్ ఫోర్స్ అధికారులు ఏరియల్ సర్వే ద్వారా వరద పరిస్థితిని, సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. వరదనీరు వెళ్లిపోయిన ప్రాంతాల్లో ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించడం అధికారులకు పెను సవాల్ గా మారింది. అంటువ్యాధులు ప్రబల కుండా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నరు.  
« PREV
NEXT »

No comments

Post a Comment