తాజా వార్తలు

Wednesday, 2 December 2015

కాపుల రిజర్వేషన్ విషయంలో చంద్రబాబుకు ముద్రగడ మూడు పేజీల లేఖ

కాపుల రిజర్వేషన్ విషయంలో కాలయాపన చేయడానికే ప్రభుత్వం కమిసన్ వేసిందని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మూడు పేజీల లేఖ రాశారు.ప్రభుత్వం వద్ద అన్ని గణాకాల వవరాలు ఉన్నప్పుడు మళ్లీ కమిషన్ వేయవలసిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.చిత్తశుద్ది ఉంటే చంద్రబాబు గత ఎన్నికలలో ఇచ్చిన హామీని నెల రోజులలో అమలు చేయవచ్చని అన్నారు. కమిషన్ అంటే అది పూర్తి కావడానికి మరో జన్మ చూడవలసి ఉంటుందని అన్నారు. తమ వెనుక ఎవరో ఉన్నారని చంద్రబాబు వంకర మాటలు మాట్లాడడం తగదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యతిరేకంగా ఉద్యమం చేసినప్పుడు మా వెనుక మీరు ఉన్నారా అని ముద్రగడ ప్రశ్నించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment