తాజా వార్తలు

Wednesday, 2 December 2015

గుజరాత్ లో బీజేపీకి షాక్

గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీకి షాక్ తగిలింది.  ప్రధాని మోదీ సొంత జిల్లా మెహ్సనాలో జిల్లా పరిషత్, మున్సిపల్ కొర్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గత అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీకి ఈ సారి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. గుజరాత్ లో వరుస ఓటములతో ఢీలాపడ్డ కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంజుకుంది. కాంగ్రెస్ ఎక్కువ జిల్లా పరిషత్ లను సొంతం చేసుకుంది. మెహ్సనా, తాపి, గాంధీనగర్ జిల్లా పరిషత్ లను గెలుచుకుంది. ప్రస్తుత ఫలితాలను బట్టి మూడింట రెండొంతుల స్థానాలను కాంగ్రెస్ గెలిచే అవకాశముంది. కాగా ఆ రాష్ట్రంలోని మొత్తం ఆరు మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ దక్కించుకుంది. మున్సిపాల్టిల్లోనూ బీజేపీ హవా కొనసాగుతున్నా కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. రిజర్వేషన్లు కల్పించాలని గుజరాత్ లో పటేళ్లు ఆందోళన బాటపట్టడం, అధికార బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉండటంతో.. గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీ తన పట్టును నిలబెట్టుకోగా, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment