తాజా వార్తలు

Wednesday, 9 December 2015

ఓయూలో...నో బీఫ్ పెస్టివల్- హైకోర్టు

ఉస్మానియా యూనివర్శిటీలో బీఫ్ ఫెస్టివల్‌కు హైకోర్టు అనుమతి నిరాకరించింది. బీఫ్ ఫెస్టివల్‌‌‌ జరగకుండా చూడాలంటూ కొందరు సిటి సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సివిల్ కోర్టు ఈ నెల 20 వరకు వర్శిటీలో ఎలాంటి ఫెస్టివల్స్ నిర్వహించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై విద్యార్ధులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సివిల్ కోర్టు తీర్పును సమర్థించింది. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చవద్దంటూ విద్యార్థులకు సూచించింది. తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. సాదారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించింది. 

« PREV
NEXT »

No comments

Post a Comment