తాజా వార్తలు

Wednesday, 2 December 2015

చెన్నైలో వరద కష్టాలు

చెన్నైలో వరద కష్టాలు పెరుగుతున్నాయి. నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై పూర్తిగా నీట మునిగింది. ఇప్పటికే 260 మంది చనిపోగా.. వేలాది ఇళ్లు నీటిలోనే మునిగి ఉన్నాయి.

వరద నీరు ఇళ్లలోకి చేరడంతో… ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కడలూరు, కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, తిరువణ్ణామలై జిల్లాల్లో వరద ముంపుతో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. కడలూరులోని పదివేల ఇళ్లు నీటమునగడంతో… ప్రజలను పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

వర్ష బీభత్సంపై సీఎం జయలలిత ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటిస్తున్నారు. 9 జిల్లాల్లో ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వాయిదా వేసింది. ప్రధాని మోడీ కూడా పరిస్థితిపై ఆరా తీశారు. సీఎం జయలలితకు ఫోన్ చేసి.. సాయంపై హామీనిచ్చారు. ఇప్పటికే తమిళనాడుకు కేంద్రం 930 కోట్ల సాయం ప్రకటించింది.
« PREV
NEXT »

No comments

Post a Comment