తాజా వార్తలు

Tuesday, 1 December 2015

మిదున్ రెడ్డి కేసులో ఎందుకీ పక్షపాతం..?

 రాజంపేట ఎమ్.పి మిదున్ రెడ్డి చేసిన ఫిర్యాదును చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీసులు నమోదే చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతి విమానాశ్రయంలో జరిగిన గొడవపై ఎయిర్ ఇండియా మేనేజర్ చేసిన ఫిర్యాదును తీసుకున్నప్పుడు ఎమ్.పి మిదున్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును ఎందుకు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది.వ్యక్తిగతంగా రాలేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పగా,సుప్రింకోర్టు ఆదేశాలు తెలియవా అని ప్రశ్నించారు. వ్యక్తిగతంగా రాకపోయినా, ఈ మెయిల్ ద్వారా వచ్చినా,పోస్టులో వచ్చినా కేసు నమోదు చేయాలని చెప్పిన విషయాన్ని న్యాయమూర్తి గుర్తు చేశారు.రాజకీయ కారణాలతో నే ఈ ఫిర్యాదును తీసుకోలేదని మిదున్ రెడ్డి తరపు న్యాయవాది చెప్పారు. పోలీసులకు రాజకీయాలతో ఏమి సంబందం అని జడ్జి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.హైకోర్టు బాగానే స్పందించింది.
« PREV
NEXT »

No comments

Post a Comment