తాజా వార్తలు

Saturday, 5 December 2015

మరో ఐఎస్ ఐ ఏజెంట్ అరెస్ట్

భారత భద్రతా రహస్యాలను పాకిస్థాన్ కు చేరవేస్తున్న మరో ఐఎస్ఐ ఏజెంట్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేసిన ఇద్దరు ఐఎస్ఐ ఏజెంట్లు ఇచ్చిన సమాచారం మేరకు ఇతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీకి చెందిన స్కూల్ టీచర్ గా గుర్తించారు. మరోవైపు గతంలో అరెస్ట్ చేసిన ఇద్దరు ఐఎస్ఐ ఏజెంట్లపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం ...లష్కర్ తోయిబాతో కలిసి ఢిల్లీ సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో దాడులకు వీరు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు 
అస్సోం లో జంట పేలుళ్లు కలకలం రేపాయి. గౌహతిలోని ఫ్యాన్సీ బజార్లో రెండు నాటు బాంబు పేలాయి. చెత్తకుండీలో బాంబులు ఉన్నట్లు గుర్తించారు పేలుడు దాటికి ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. పేలిన జంట బాంబుల తీవ్రత తక్కువగా ఉండటంతో భారీ ప్రమాదం తప్పింది. ఐతే ఘటనకు బాధ్యులెవరన్నది ఇంక తేలలేదు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు
« PREV
NEXT »

No comments

Post a Comment