తాజా వార్తలు

Monday, 21 December 2015

కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేసిన అరుణ్ జైట్లీ

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ పరువు నష్టం దావా వేశారు. ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్‌ వ్యవహారంలో వీరిద్ధరి మధ్య వార్ వ్యక్తిగత స్థాయికి చేరింది. తన పరువుకు భంగం కలిగించేలా కేజ్రీవాల్ ఆసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ అరుణ్ జైట్లీ పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహారించినందుకు 10 కోట్ల రూపాయల నష్ట పరిహారం ఆయన డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి అరుణ్‌ జైట్లీ పటియాల హౌజ్‌ కోర్టులో స్టేట్‌ మెంట్ ఇచ్చారు. ఆయనతో పాటు కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, పీయూష్‌ గోయల్‌, జేపీ నడ్డా కు కోర్టుకు వచ్చారు. జైట్లీ స్టేట్‌ మెంట్ తీసుకున్న న్యాయమూర్తి తదుపరి విచారణను వచ్చే నెల 5 కు వాయిదా వేశారు. జైట్లీ కోర్టు వచ్చిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయపరంగానే అరుణ్ జైట్లీని ఎదుర్కొంటామని ఆప్ నేతలు స్పష్టం చేశారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment