తాజా వార్తలు

Sunday, 13 December 2015

బుల్లెట్ ట్రైన్ దూసుకొస్తుంది

భారత్-జపాన్  మధ్య దౌత్య సంబంధాల్లో మరో కీలక అడుగు పడింది.
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ తో పాటు పౌర అణు ఒప్పందాలపై ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది.
దీంతోపాటు మేకిన్ ఇండియాకు పూర్తి సహకారం అందిస్తామని జపాన్ పీఎం తెలిపారుభారత్ వృద్ధి కూడా బుల్లెట్ వేగంతో ముందుకు వెళ్లాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారుప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షింజో అబేకు విమానాశ్రయంలో  అధికారులు ఘన స్వాగతం పలికారు. మోడీ, షింజో అబే గంగా మాతకు హారతి ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారువేదపండితుల మధ్య దూప దీపాలతో హారతి కార్యక్రమం జరుగుతోంది. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాని రాక సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇటు ఘాట్ను రంగు రంగు పూలతో అందంగా ముస్తాబు చేయడంతో పాటు 7వేలమందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment