తాజా వార్తలు

Tuesday, 15 December 2015

దళితులకు వెయ్యి ఎకరాల పంపిణీ-కడియం

వరంగల్ జిల్లాలో భూమి లేని నిరుపేద దళితులకు జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భం గా వెయ్యి ఎకరాల భూమి పంపిణీ చేయనున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. జిల్లాలోని అన్ని ఎస్సీ,ఎస్టీ, బీసీ, వికలాంగుల హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందు కు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించా రు. హాస్టళ్లను నివాసయోగ్యంగా మార్చే కార్యక్రమా న్ని మార్చి 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. హాస్టళ్లలోని పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలపై దృష్టిసారించాలని కలెక్టర్‌కు సూచించారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ద్వారా అందించే పథకాలకు కలెక్టర్ ఆధ్యక్షత న మాత్రమే అర్హులను ఎంపిక చేయాలన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి స్కాలర్‌షిప్‌ల కోసం ఆన్‌లైన్(ఈ పాస్) ద్వారా దరఖాస్తు చేసుకొనే గడువును 31 వరకు పెంచినట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు.  నిన్నటితో గడువు ముగిసినప్పటికీ, చాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేదనే సమాచారం మేరకు గడువు పెంచినట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగులు, మహిలా శిశు సంక్షేమశాఖల ద్వారా అమలవుతున్న పథకాల ప్రగతిపై గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌తో కలిసి కడియం శ్రీహరి సమీక్షించారు.  

« PREV
NEXT »

No comments

Post a Comment