తాజా వార్తలు

Wednesday, 2 December 2015

ఓ మహిళతో ముఖ్యమంత్రి కూడా వీడియోకి చిక్కారా

వీడియోలలో చిక్కుతున్న రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఈ జాబితాలో చేరారు. కేరళలో జరిగిన సౌర విద్యుత్ కుంభకోణానికి సంబందించి విచారణ జరుగుతోంది. ఈ కుంభకోణంలో నిందితుడైన బిజు రాదాకృష్ణన్ విచారణ కమిషన్ ముందు ఈ బాంబు పేల్చారు. తన భాగస్వామి అయిన ఒక మహిళతో ముఖ్యమంత్రి తో సహా ఐదుగురు మాట్లాడిన వీడియో ఉందని, తప్పడు పనికి సంబందించిన వీడియో ఉందని ఆయన తెలిపారు.ఆ వీడియో దృశ్యాలను పూర్తిగా వివరించకపోయినా, మొత్తం మీద ఏదో గొడవ ఉన్నట్లు అర్ధం అవుతుంది. ముఖ్యమంత్రికి, మరికొందరికి ఐదున్నర కోట్లు ఇచ్చినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ఈ వీడియో కలకలం ఉమెన్ చాందీని ఇరుకున పెడుతోంది.చాందీ రాజీనామా చేయాలని విపక్ష నేత అచ్యుతానందన్ డిమాండ్ చేశారు.నిజంగానే ముఖ్యమంత్రి వీడియోకి చిక్కిన దృశ్యాలు ఉన్నాయా?లేక బెదిరించడానికి అన్నారా అన్నది తెలియాలి. అవసరమైతే వీడియోని బయటపెడతానని రాదాకృష్ణన్ అంటున్నాడు 
« PREV
NEXT »

No comments

Post a Comment