తాజా వార్తలు

Thursday, 10 December 2015

వరంగల్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ బోణీ


వరంగల్‌ జిల్లాలోని స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొండా మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లు గురువారం ఉపసంహ‌రించుకున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు టీఆర్ఎస్ వశమైంది. ఈ స్థానానికి ఇండిపెండెంట్లు మినహా రాజకీయ పార్టీలకు సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థి కొండా మురళీ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆ పార్టీకి పోటీ లేకుండా పోయింది. నామినేషన్ దాఖలు సమయంలోనే విపక్షాలన్నీ చేతులెత్తేశాయి.  
« PREV
NEXT »

No comments

Post a Comment