తాజా వార్తలు

Friday, 18 December 2015

లోఫర్ టాక్

మెగా వారసుడు వరుణ్ తేజ్ నటించిన ఈ లోఫర్ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అయినట్లే ! 
కథలోకి వెళితే.. కోటీశ్వరురాలైన రేవతిని ప్రేమిస్తాడు పోసాని. ప్రేమ కోసం కోట్ల ఆస్థిని కాదనుకొని వస్తుంది కానీ, వచ్చిన తర్వాతే తెలుస్తుంది తను ప్రేమించింది ఒక పెద్ద లోఫర్ ని అని దాంతో ఇద్దరి మద్య వివాదం జరగడంతో  కొడుకు వరుణ్ తేజ్  ని తనకంటే పెద్ద లోఫర్ ని చేయాలనీ భావించి కసితో అక్కడి నుండి జోద్ పూర్ తీసుకు వెళతాడు . తల్లి పచ్చ కామెర్లతో చనిపోయిందని అబద్దాలు చెప్పి నిజంగానే కొడుకుకి పెద్ద లోఫర్ ని చేస్తాడు మురళి. ఇక అదే సమయంలో ఇంటి నుండి పారిపోయి జోద్ పూర్ కు వస్తుంది దిశా పటాని. జోద్ పూర్ లో అడుగు పెట్టగానే లోఫర్ తండ్రి కొడుకులు ఒకరు సెల్ ఫోన్ కొట్టేస్తే మరొకరు బ్యాగ్ కొట్టేస్తారు. ఆ తర్వాత అదే పారిజాతం తో లవ్ లో పడతాడు రాజా కానీ సడెన్ గా పారిజాతం కు సంబందించిన వాళ్ళు జోద్ పూర్ వచ్చి పారిజాతం ని తీసుకెలుతుండగా పారిజాతం మేనత్త ని చూసి షాక్ అవుతాడు రాజా . అసలు పారిజాతం మేనత్త ఎవరు ? ఆమెకు రాజా కు సంబంధం ఏంటి ? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
లోఫర్ గా వరుణ్ తేజ్ నటన అందరినీ ఆకట్టుకునేలా ఉంది . మాస్ హీరోకు ఉండాల్సిన లక్షణాలన్నీ వరుణ్ లో ఉన్నాయి . వరుణ్ స్క్రీన్ ప్రేజెన్స్ ఈ లోఫర్ కు హై లెట్ అని చెప్పవచ్చు . ఇక తల్లిగా రేవతి నటన ,మరో లోఫర్ గా పోసాని నటన బాగా కుదిరింది . హీరోయిన్ దిశా పటాని గ్లామర్ తో మెప్పించింది . రొమాంటిక్ సన్నివేశాల్లో మరింత రాటు దేలింది దిశా పటాని . వరుణ్ ,పోసాని ,రేవతి ల మద్య వచ్చే సన్నివేశాలు బాగా పండాయి.
 అయితే మల్టీ ప్లెక్స్ లలో ఈ చిత్రానికి అంతగా ఆదరణ ఉండకపోవచ్చు . కామెడీ లేకపోవడం కొంత మైనస్ అయినప్పటికీ ఓవరాల్ గా చూస్తే మాత్రం వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ ,దిశా గ్లామర్, మదర్  సెంటిమెంట్ లతో పైసా వసూల్ సినిమా అనే చెప్పాలి.
« PREV
NEXT »

No comments

Post a Comment