తాజా వార్తలు

Saturday, 5 December 2015

చిరంజీవికి ఆహ్వానం లేదట

వరుణ్‌తేజ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సికె ఎంటర్ టైన్మెంట్స్ సి.కళ్యాణ్ సమర్పణలో శ్రీ శుభేశ్వేత ఫిలింస్ పతాకంపై సివి రావు, శ్వేతలానా , వరుణ్‌తేజ్ నిర్మిస్తున్న భారీచిత్రం లోఫర్. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈచిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. డిసెంబర 7 ఈచిత్రం ఆడియోను గ్రాండ్‌గా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సి.కళ్యాణ్ మాట్లాడుతూ ఈచిత్రం ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. డిసెంబర్ 7 శిల్పకళా వేదికలో చిత్రం ఆడియో విడుదల చేయనున్నామన్నారు

 అయితే ఆడియో వేడుకను కాస్త ఢిఫరెంట్ గా ప్లాన్ చేసారనే వార్తలు వస్తున్నాయిఇటీవల మెగా హీరోల ఆడియో వేడుకలకు చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా హాజరై వారిని ఆశీర్వదిస్తున్నారు.అయితే లోఫర్ ఆడియో ఫంక్షన్ కు కూడా చిరంజీవి వస్తారని అందరూ భావించగా , చిత్ర యూనిట్ ప్రభాస్ ను గెస్ట్ గా పిలిచి అందరిని అయోమయంలో పడేలా చేసింది. దీంతో చిరంజీవి రాకపోవడంపై అభిమానుల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయిచిరంజీవి గెస్ట్ గా రాకపోవడంపై చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఆడియో వేడుకను చాలా ఢిఫరెంట్ గా చేయాలనుకున్నాం, అందుకే మెగా ఫ్యామిలీ హీరోలని కాకుండా ప్రభాస్ ని గెస్ట్ గా ఆహ్వనించామని కళ్యాణ్ తెలిపారు. అలాగే డిసెంబర్18 ప్రపంచవ్యాప్తంగా ఈచిత్రాన్ని విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు 
« PREV
NEXT »

No comments

Post a Comment