తాజా వార్తలు

Monday, 7 December 2015

మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాల్సిందే-కేటీఆర్

మూడంచెల పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయించింది. పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ ను ఢిల్లీలో కలిశారు. 14వ ఫైనాన్స్ కమీషన్ నిధులను కేవలం పంచాయితీలకే ఇవ్వడంతో కలుగుతున్న ఇబ్బందులను వివరించారు..స్థానికంగా తలెత్తుతున్న సమస్యలతో పాటు, పథకాల అమలుకు ఎదురవుతున్న అవరోధాలను బీరేంద్రసింగ్ దృష్టికి తీసుకెళ్లారు..కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలుకావాలంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా మూడంచెల పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రికి తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల జీతాలను భారీగా పెంచి వారి సామాజిక గౌరవాన్ని పెంచామన్నారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment