తాజా వార్తలు

Wednesday, 9 December 2015

బర్దన్ బ్రతికుండగానే ... మమత సంతాపం!

అస్వస్థత కారణంగా సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్దన్ ఢిల్లీలోని జీబీ పంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన చనిపోయారనుకుని పొరపాటున పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు "బర్దన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. చాలా కాలం పాటు ఆయన రాజకీయాల్లో, కార్మిక సంఘాల్లో పనిచేశారు. ఆయన మరణం తీరనిలోటు. బర్దన్ కుటుంబానికి, సన్నిహితులకు సంతాపం తెలుపుతున్నా" అని దీదీ ట్వీట్ చేశారు. తరువాత బర్దన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకుని వెంటనే ఆ ట్వీట్ ను తొలగించారు. అప్పటికే ఈ ట్వీట్ ను స్క్రీన్ షాట్ తీయడంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరోవైపు బర్దన్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment