తాజా వార్తలు

Monday, 21 December 2015

మిస్ యూనివర్స్ ప్రకటనలో గందర గోళం

మిస్ యూనివర్స్-2015 పోటీ విజేత ప్రకటన వినూత్నంగా సాగింది. కిరిటాన్ని ఫిలిప్పీన్స్‌కు చెందిన పియా అలోంజో వర్ట్స్‌బ్యాచ్ సొంతం చేసుకొన్నది. పియాకు ఈ కిరీటం దక్కడానికి ముందు పోటీలో గందరగోళం చోటుచేసుకున్నది. హోస్ట్ స్టీవ్ హార్వీ పొరపాటుగా మిస్ యూనివర్స్‌గా రన్నరప్‌గా నిలిచిన మిస్ కొలంబియాను విజేతగా ప్రకటించారు. దాంతో మిస్ కొలంబియా ఆరియాడ్నా గుటీర్రెజ్ కండ్లల్లో మెరుపులు మిలమిల మెరిశాయి. ఆనందం సముద్రంలా ఉప్పొంగింది. సంప్రదాయం ప్రకారం ఆరియాడ్నాకు కిరీటం తొడిగారు. పుష్ఫగుచ్ఛాలు అందజేశారు. అయితే ఆరియాడ్నాలో ఆ ఆనందం, మెరుపులు ఎంతోసేపు నిలువలేదు. అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో హోస్ట్ తన పొరపాటును గ్రహించారు. వెంటనే సర్దుకొని మళ్లీ మిస్ ఫిలిప్పీన్స్ పియాను మిస్ యూనివర్స్‌గా ప్రకటించి తన తప్పును సరిదిద్దుకున్నారు. ఇంక ఏముంది మిస్ కొలంబియా తలమీద నుంచి కిరీటాన్ని తీసి మళ్లీ మిస్ ఫిలిప్పీన్స్‌కు తొడిగి అసలు విజేతను సన్మానించారు. ఇదంతా జరుగుతున్న సేపు వర్ట్స్‌బ్యాచ్ నోటమాట రాక షాక్‌కు గురైంది. ఎట్టకేలకు తనకు విశ్వసుందరి కిరీటం దక్కడంతో పియా ఆనందంతో గంతులేసింది. 
« PREV
NEXT »

No comments

Post a Comment