తాజా వార్తలు

Friday, 25 December 2015

మోడీ-షరీఫ్ భేటీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్తో సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం లాహోర్లోని షరీఫ్ నివాసంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై మోదీ, షరీఫ్ చర్చించారు.  ఆప్ఘనిస్తాన్ నుంచి సాయంత్రం 4:45 గంటలకు మోదీ లాహోర్ విమానాశ్రయంలో దిగారు. లాహోర్ విమానాశ్రయంలో నవాజ్ షరీఫ్ సాదరంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి మోదీ, షరీఫ్ కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో షరీఫ్ వ్యక్తిగత నివాసానికి వెళ్లారు. 1700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇంట్లోనే నవాజ్ షరీఫ్ మనవరాలి పెళ్లికి హజరయ్యారు. మరోవైపు కాబూల్లో కొత్తగా నిర్మించిన ఆఫ్ఘనిస్థాన్ పార్లమెంట్ భవనాన్ని ఆదేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో కలిసి ప్రారంభించారు ప్రధానమంత్రి మోడీ. నూతన భవనానికి అటల్ బ్లాక్గా నామకరణం చేశారు. 710కోట్ల రూపాయలతో ఆఫ్ఘనిస్థాన్ పార్లమెంట్ భవనాన్ని నిర్మించింది భారత్. 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. ఇప్పుడు మోడీ ప్రారంభించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment