తాజా వార్తలు

Monday, 21 December 2015

నాని షూటింగ్ లో అపశృతి, లైట్ మన్ మృతి

నాని నటిస్తున్న తాజా సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందారు. సినిమా షూటింగ్ స్పాట్‌లో తిరుపతి అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నాని, సురభిథామస్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా సినిమా షూటింగ్ సంఘీనగర్ సర్పంచ్, సంఘీ స్పిన్నర్ యజమాని అమిత్ సంఘీ గెస్ట్‌హౌస్‌లో కొనసాగుతుంది. విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రామానికి చెందిన పత్తిలికాయ తిరుపతి కొండాపూర్‌లోని సిధ్దానగర్‌లో నివాసముంటూ షూటింగ్ వాహన క్లీనర్‌ గా, లైట్‌మెన్‌ గా పనిచేస్తున్నాడు. షూటింగ్ జరుగుతున్న సమయంలో తిరుపతి అకస్మాత్తుగా కిందపడిపోయాడు. దీంతో తోటి కార్మికులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. షూటింగ్ స్పాట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే తిరుపతి మృతి చెందాడని ఆరోపణలు వచ్చాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment