తాజా వార్తలు

Wednesday, 30 December 2015

ఆంక్షల్లో సెలబ్రేషన్స్

రెండు రాష్ట్రల్లో నూతన సంవత్సర వేడుకల్లో అపశృతులు జరుగకుండా పక్కాగా ఏర్పాట్లు ఏశారు పోలీసులు. 
 విశాఖలో న్యూఇయర్ సెలబ్రేషన్స్పై పోలీసులు ఆంక్షలు విధించారుకొత్త సంవత్సర వేడుకల ముసుగులో సంఘ వ్యతిరేక శక్తులు విజృంభించకుండా ఉండేందుకు  ఆంక్షలు విధించామని పోలీసులు తెలిపారుఅర్థరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే బార్ రెస్టారెంట్లకు పర్మిషన్ ఇస్తున్నామని విశాఖ డిసిపి త్రివిక్రమ వర్మ తెలిపారుకెపాసిటీకి మించి పాస్లు ఇవ్వవద్దనిఇల్లీగల్ యాక్టివిటీస్కు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్టార్ హొటళ్ల యాజమాన్యాలను హెచ్చరించామని ఆయన తెలిపారుఈవ్ టీజింగ్ జరగకుండా హొటల్ యాజమాన్యాలే జాగ్రత్తలు తీసుకోవాలని డిసిపి అన్నారుగీత దాటే వాహనదారులపై కొరడా ఝళిపిస్తామని ట్రాఫిక్ ఎడిసిపి మహేంద్రపాత్రుడు తెలిపారున్యూఇయర్ ఆంక్షలతో ప్రజలను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదనిఅందరూ సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని పోలీసు అధికారులు తెలిపారు.
ఇటు హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకల కార్యక్రమాలకు రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతులు ఇస్తున్నారు సందర్భంగా నిర్వాహకులు ఎలాంటి నిబంధనలను పాటించికపోయిన వారిపై సెక్షన్ 133 సీఆర్పీసీ కింద కేసులను నమోదు చేసి వారి ప్రాంతాన్ని సీజ్ చేస్తామని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారుఅదే విధంగా వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు రోజు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ను నిర్వహిస్తామన్నారుసైబరాబాద్ పరిధిలో ఉన్న పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేఫ్లైఓవర్లుఔటర్ రింగ్రోడ్డులపై డిసెంబరు 31 రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకలకు నిషేధించారు.

న్యూఇయర్ వేడుకలుకు నిబంధనలివీ..
  1.  31 కార్యక్రమాలను రాత్రి 8 గంటల నుంచి ఒంటిగంట వరకు నిర్వహించాలి.
  2.   కార్యక్రమాలకు వచ్చే ప్రేక్షకుల సామర్థ్యాం వివరాలను ముందుగానే పోలీసులకు తెలపాలిఇన్విటేషన్ ఉంటేనే అనుమతిని ఇవ్వాలి.
  3.  రిజిస్టర్ చేసుకున్న జంటలు వారి కుటుంబసభ్యులను మాత్రమే అనుమతించాలి.ఒంటరిగా వచ్చే వారిని అనుమతించకూడదు.
  4.  సీపీ సైబరాబాద్ నుంచి అనుమతి రాకుండా ముందస్తుగా వేడుకలకు సంబంధించిన పోస్టర్లను 
  5. బహిరంగ ప్రదేశాల్లో ప్రకటనల పోస్టర్లుహోర్డింగ్లను ఏర్పాటు చేయొద్దు.
  6.  వేడుకల్లో గేమింగ్ వంటి కార్యక్రమాలను నిర్వహించొద్దు
  7. డీజేలకు అనుమతి లేదుసౌండ్ బాక్సుల శబ్ధం కూడా 45 డెసిబుల్స్ స్థాయి మించకూడద్దు
  8. డీజే అవసరమనుకున్న వారు స్థానిక ఎస్హెచ్ లేదా ఏసీపీ నుంచి అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి.
  9.  ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు అశ్లీల పోస్టర్లుఫిలింలను ప్రదర్శించవద్దు.అశ్లీల నృత్యాలు నిషేధం
  10.  వేడుకల ప్రచారం కోసం అర్ధనగ్న చిత్రాలతో ప్రకటనలను చేయరాదు.
  11.  ఎక్సైజ్ శాఖ నుంచి సరైన అనుమతి లేనిదే వేడుకల్లో మద్యాన్ని ఇవ్వరాదు.
  12.  ప్రజలకు ప్రమాదకరమైన పరిస్థితులను కలిగించే కార్యక్రమాలను చేపట్టవద్దు
  13.  వేడుకల్లో తుపాకులతో రావడం నిషేధంలైసెన్సులు ఉన్నా వాటిని వేడుక ప్రాంగణాన్ని తీసుకురావద్దు
  14.  ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతులు తప్పనిసరి.
  15.  పోలీసులు జారీ చేసిన సమయ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.
  16.  నిర్వాహకులు నియమ నిబంధనల గురించి ప్రేక్షకులకు ముందస్తుగా వివరించాలి
  17.   వేడుకలకు సంబంధించి మొత్తం కార్యక్రమాన్ని మినిట్ టూ మినిట్ రికార్డు చేయాలి రికార్డింగ్లను రెండు రోజుల తర్వాత సీపీ కార్యాలయంలో అందజేయాలి.
  18.  న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించే నిర్వాహకులు కార్యక్రమాల ప్రాంగణాల్లో సీసీటీవీలుడీఎఫ్ఎమ్డీలు
  19. మెటల్ డిటెక్టర్లను తప్పని సరిప్రాంగణమంతా స్పష్టంగా కనపడేలా లైటింగ్ను పెట్టుకోవాలి
  20.  పటాకులను కాల్చడం నిషేధంఅగ్నిప్రమాదాల నివారణకు సామగ్రితో పాటు నీళ్ళను ఉంచుకోవాలి
  21.  నిబంధనల పరిశీలన కోసం స్థానిక ఇన్స్పెక్టర్ వేడుక ప్రాంతాన్ని ముందస్తుగా పరిశీలిస్తారు.
  22.  సెలబ్రేషన్స్ సందర్భంగా ఏదైనా అపశృతులు జరిగినాగొడవలు చోటు చేసుకున్నా అనుమతి తీసుకున్న వారు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది
  23.  ఈవెంట్లు జరిగే ప్రాంతాల్లో పబ్లిక్ రద్దీని కంట్రోల్ చేసేందుకుట్రాఫిక్ జామ్లు లేకుండా వాహనాలను పార్క్ చేసేందుకు ప్రైవేటు సెక్యురిటీని ఏర్పాటు చేసుకోవాలివాహనాలను నిలపవద్దు.



« PREV
NEXT »

No comments

Post a Comment