తాజా వార్తలు

Wednesday, 2 December 2015

నిఖిల్ కి పవన్ చెప్పింది ఏంటి?

నిఖిల్, నందిత జంటగా నటించిన శంకరాభరణం డిసెంబర్ 4 న విడుదల కానుండగా, ఈ చిత్ర ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.ఈ చిత్రంలో అంజలి ఓ ప్రత్యేక పాత్ర చేయనుండగా, ఉదయనందనవనం దర్శకత్వం వహించారు.ఇంక ఈ చిత్రానికి కోన వెంకట్ సహ నిర్మాతగా వ్యవహరించడం మూవీపై మంచి ఎక్స్ పెక్టేషన్ ను పెంచింది.

ఇటీవల శంకరాభరణం యూనిట్ తమ చిత్రానికి వినూత్న రీతిలో ప్రచారం కలిపిస్తుండగా, పవన్ కళ్యాణ్ తో టీజర్ రిలీజ్ చేయించారు. ఈ సందర్బంలో పవన్ ఆ టీజర్ ని చూస్తూ,నిఖిల్ కు ఏదో చెప్పాడు.దాంతో నిఖిల్ మెలికలు తిరుగుతూ కాస్త సిగ్గు పడ్డట్టు కనిపించింది.అయితే ఈ విషయం గురించి నిఖిల్ తాజాగా ఓ కార్యక్రమంలో తెలియజేశారు.
బాడీ పెంచావా ? అని తనను పవన్ అడిగారని,ఇన్నాళ్ళు పడ్డ కష్టం ఆ ఒక్క మాటతో మటుమాయం అయిపోయిందని నిఖిల్ తెలిపాడు.అంతేకాదు తను ఎంతగానో అభిమానించే స్టార్ తన లోని మార్పును గుర్తించటం తనకు చాలా హ్యపీగా ఉందంటూ నిఖిల్ పేర్కొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment