తాజా వార్తలు

Friday, 18 December 2015

నిర్భయ నిందితుడిని విడిచిపెట్టొద్దు-నిర్భయతల్లి

దేశ రాజధాని హస్తినలో డిసెంబర్ 16, 2012న కదులుతున్న బస్సులో మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు సామూహిక అత్యాచారం చేసిన విషయం విదితమే. ఈ కేసులో ఒక నిందితుడు మైనర్. బాల నేరస్థుడి విడుదలకు ఢిల్లీ హైకోర్టు సుముఖత వ్యక్తం చేసింది. ఈ క్రమంలో బాల నేరస్థుడు డిసెంబర్ 20న విడుదల కానున్నారు. బాల నేరస్థుడి విడుదలను నిలిపివేయాలని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిర్భయ కేసులో బాల నేరస్థుడి విడుదల మంచిది కాదని జ్యోతి సింగ్ తల్లి ఆశా దేవీ పేర్కొన్నారు.  ఒక వేళ బాల నేరస్థుడిని విడుదల చేస్తే అతని ముఖాన్ని సమాజానికి చూపించాలని డిమాండ్ చేశారు. అతని విడుదల సమాజానికి ముప్పు లాంటిదని చెప్పారు. తన కూతురు చనిపోయి మూడేళ్లు అవుతున్న సందర్భంగా బాల నేరస్థుడి విడుదల తాము చూడాలా? ఇదేక్కడి న్యాయం? నేరం చేసిన వాడికి వయస్సుతో సంబంధం లేకుండా శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ బాల నేరస్థుడు అత్యంత క్రూరమైన నేరం చేశాడని ధ్వజమెత్తింది. ఈ కేసులోని నిందితులందరికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. 

 బాల నేరస్థుడికి శిక్ష పడి మొన్న డిసెంబర్ 16 నాటికి మూడేళ్లు అవుతుంది. మూడేళ్ల శిక్ష పూర్తయిన నేపథ్యంలో బాల నేరస్థుడి విడులకే కోర్టు సుమఖత వ్యక్తం చేసింది.
« PREV
NEXT »

No comments

Post a Comment