తాజా వార్తలు

Tuesday, 29 December 2015

త్వరలో కొత్త పార్లమెంట్

పార్లమెంట్ భవనాన్ని మరొకటి నిర్మించుకుందామంటూ కేంద్రంలో అడుగుపడుతున్నాయి. అంతర్జాతీయ హంగులతో పార్లమెంట్ కు కొత్త భవనం నిర్మించాలన్న ప్రతిపాదనకు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. లేటెస్ట్ టెక్నాలజీతో… కొత్త భవన నిర్మాణానికి చొరవ చూపాలని కోరారు. ప్రస్తుతం ఉన్న భవనం ఇరుకుగా ఉందని… 88 ఏళ్ల క్రితం నిర్మించారన్నారు. పార్లమెంట్ ఆవరణలోనే మరో స్థలాన్ని, రాజ్ పథ్ దగ్గర వేరే స్థలాన్ని ఆమె సూచించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81, క్లాజ్ 3 ప్రకారం… 2026 తర్వాత లోక్ సభ సీట్లు మరింత పెరిగే అవకాశముందన్నారు స్పీకర్. ప్రస్తుతం ఉన్న భవనం పాతబడిందని, హెరిటేజ్ బిల్డింగ్ హోదాతో రిపేర్లు కూడా కష్టమవుతుందన్నారు. దీనిపై కేబినెట్ ముందు.. వెంకయ్యనాయుడు నోట్ పెట్టే అవకాశముంది.  హెరిటేజ్ బిల్డింగ్ హోదాతో పాత భవనాన్ని కాపాడుకుంటూ… కొత్త బిల్డింగ్ ణు నిర్మించుకోవడం తప్పేం కాదంటున్నారు. లాస్ట్ ఇయర్ ప్రజాపద్దుల కమిటీ ఈ ప్రతిపాదన చేసింది. ఇప్పుడు ఆ ప్రపోజల్ కు ఓకే చెప్పారు సుమిత్ర. అయితే… పార్లమెంట్ కొత్త భవన నిర్మాణంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరికొందరు మాత్రం కొత్త భవన నిర్మాణ ప్రతిపాదన మంచిదేనంటున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment