తాజా వార్తలు

Wednesday, 9 December 2015

జగన్ గూటికి పవన్ మిత్రుడు?

విజయవాడకు చెందిన పారిశ్రామిక దిగ్గజం..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆప్త మిత్రుడు.. పీవీపీగా పాపులర్ అయిన పొట్లూరి వరప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా? అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు పార్టీ అధిష్టానం కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.రాజకీయాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉన్న పొట్లూరి   గత ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. విజయవాడ లోక్ సభ టికెట్ ను ఆశించి భంగపడ్డారు.  పవన్ జనసేనలో చేరి ఆ పార్టీ తరపున ఎంపీ టికెట్ దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేశారు. తీరా జనసేన ఎన్నికల బరిలో లేకపోవడంతో నిరాశచెందారు.
మరోవైపు ఆర్ధికంగా బాగా బలంగా ఉన్న పొట్లూరి వరప్రసాద్ ను పార్టీలో చేర్చుకోవడానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కృష్ణాజిల్లాలో పార్టీ బలపడాలంటే పీవీపీ లాంటివారు అవసరమని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది,ఏది ఏమైనా పవన్ కు అత్యంత సన్నిహితుడైన పీవీపీ వైఎస్సార్సీపీలో చేరతారన్న వార్త ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.
« PREV
NEXT »

No comments

Post a Comment