తాజా వార్తలు

Monday, 28 December 2015

ప్రత్యూషకు అండగా ఉంటా...

సవతి తల్లి హింసకు గురైన ప్రత్యూషకు అండగా ఉంటానని తండ్రి రమేష్ ధర్మాసనానకి తెలిపారు. తన పేరు మీదున్న ఫ్లాట్‌ను ప్రత్యూష పేరున రిజిస్టర్ చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె తండ్రి రమేష్ సోమవారం హైకోర్టుకు నివేదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం... రిజిస్ట్రేషన్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. వెంటనే అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.  
« PREV
NEXT »

No comments

Post a Comment