తాజా వార్తలు

Wednesday, 9 December 2015

న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉంది- రాహూల్ గాంధీ

నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్ర ప్రభుత్వం వంద శాతం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచే కక్ష్య సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు. పార్లమెంట్ వెలుపల రాహుల్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు కోర్టు నుంచి పార్లమెంట్‌కు చేరడంతో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నాయి. న్యాయ వ్యవస్థను ఎవరు అదుపులోకి తీసుకున్నారో అందరికీ తెలుసని రాహుల్ విమర్శించారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment