తాజా వార్తలు

Saturday, 19 December 2015

50వేల పూచికత్తుపై బెయిల్

కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, రాహూల్  గాంధీ ఫస్ట్ టైం కోర్టుకు హాజరయ్యారు. గతంలో చాలా సందర్భాల్లో పిటీషన్స్ పడినా.. కేసులోనూ వీళ్లు హాజరయ్యే పరిస్థితి రాలేదు. నేషనల్ హెరాల్డ్ కేసులోనూ గతంలో జరిగిన విచారణలకు హాజరుకాలేదు. ఇప్పుడు మాత్రం హాజరుకాకతప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ముందస్తు బెయిల్ కు అవకాశం ఉన్నా.. ఎలాంటి మినహాయింపు కోరుకోలేదు సోనియా, రాహుల్. పాటియాలా కోర్టు వీరిద్దరికి 50వేల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసిందితాము ఎలాంటి ఒత్తిళ్లకు భయపడేది లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తేల్చిచెప్పారు. పేదల కోసం తమ పోరాటం కొనసాగుతుందని, దాన్నుంచి తమనెవ్వరూ తప్పించలేరని స్పష్టం చేశారు. ఢిల్లీలోని పటియాలా కోర్టులో హాజరైన ఆమె.. అక్కడి నుంచి నేరుగా ఎఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశంలో రాజ్యాంగం అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తోందని, అందులో తమకు ఎలాంటి సందేహం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తమపై అన్నిరకాల అస్ర్తాలు ప్రయోగిస్తోందని, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని సోనియా ధీమా వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా తానుగాని, కాంగ్రెస్ పార్టీ గాని ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. సామాన్యుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ అబద్దాలు చెబుతున్నారని, తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని రాహుల్ విమర్శించారు.
ఒత్తిళ్ల ద్వారా ప్రతిపక్షాలను అణచివేయలేరని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ప్రజల పక్షం ఉంటుందని, ప్రజల పక్షమే కాంగ్రెస్ పక్షమన్నారు. కాంగ్రెస్ భావజాలాన్ని తాము ఎప్పటికీ వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు


« PREV
NEXT »

No comments

Post a Comment