తాజా వార్తలు

Wednesday, 2 December 2015

లీకైన 'కబలి'లో రజనీకాంత్ సాంగ్

సినీ పరిశ్రమకు పైరసీ భూతం పెద్ద సమస్యగా మారగా,ఈ బెడద పెద్ద సినిమాలను అసలు వదలడం లేదు.సినిమా రిలీజ్ కాక ముందే ఆ చిత్రానికి సంబంధించిన పోస్టర్ లు,వీడియోలు నెట్ లో చక్కర్లు కొడుతుండగా యూనిట్ తలపట్టుకు కూర్చోవలసిన పరిస్థితి వస్తోంది. ఈ లీకేజ్ ప్రాబ్లమ్ ని అరికట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన కూడా లీకేజ్ బెడద ఏ మాత్రం తగ్గడం లేదు.

తెలుగు,తమిళం,హిందీ ఇలా అన్ని భాషల్లోను ఈ లీకేజ్ బెడద ఉండగా,తాజాగా రజనీ సినిమాకు సంబంధించిన ఓ వీడియో సాంగ్ నెట్ లో చక్కర్లు కొడుతుంది.రెండు నిమిషాల పాటు సాగే ఈ వీడియో మలేషియాలొ చిత్రీకరించిన పాట ఫుటేజ్ కాగా,ఈ వీడియో సోషల్ సైట్స్ అన్నింటిలోకి పాకి యూనిట్ ని ఆందోళనలో పడేలా చేసింది.దీంతో చిత్రానికి సంబంధించిన కొందరు లీకేజ్ ని ఎంకరేజ్ చేయోద్దని అభిమానులను కోరినట్టు తెలుస్తోంది.

అత్యుత్సాహంతో ఓ కోలివుడ్ టివి ఛానల్ అప్పటికే ఆ పాటను ప్రసారం చేయగా అభిమానులు,చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.అయితే ఇదిలా జరగడం మొదటి సారి కాకపోయిన భవిష్యత్ లో ఇలాంటి బెడదలు రాకుండా దర్శక నిర్మాతలు ఈ విషయంపై మరింత దృష్టి సారించాల్సి ఉంది.
« PREV
NEXT »

No comments

Post a Comment