తాజా వార్తలు

Saturday, 19 December 2015

రంగ‌నాథ్ మ‌ర‌ణం తీర‌ని లోటు

న‌టుడు రంగ‌నాథ్ ఇకలేరు. సీనియ‌ర్ న‌టులు రంగ‌నాథ్ 1949 జూలైలో మ‌ద్రాసులో జ‌న్మించారు. ఎక్కువ‌గా కుటుంబ క‌థా చిత్రాల్లో న‌టించ‌టం ఆయ‌నను మ‌హిళ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర చేసింది. కానీ సినీ రంగంలో వ‌చ్చిన మార్పులు కార‌ణంగా కెరీర్ స్టార్టింగ్ లోనే ఒడిదుడుకులు వ‌చ్చాయి. దీంతో మ‌రో మార్గం లేక విల‌న్ గా మారారు. 'గువ్వ‌ల జంట' సినిమాతో తొలి సారిగా ప్ర‌తినాయ‌క పాత్ర‌లో అల‌రించారు. ఆ త‌రువాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గాను మెప్పించారు. వెండితెర మీదే కాదు.. బుల్లి తెర మీద కూడా తన న‌ట‌న‌తో ఆకట్టుకున్నారు రంగ‌నాధ్. పౌరాణిక నేప‌థ్యంతో తెర‌కెక్కిన భాగ‌వ‌తం సీరియ‌ల్ తో పాటు, రాఘ‌వేంద్ర‌రావుగారి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ లో తెర‌కెక్కిన శాంతినివాసం సీరియ‌ల్ లోనూ కీల‌క పాత్ర‌లో న‌టించారు. అపార సినీ అనుభ‌వం క‌లిగిన ఆయ‌న మొగుడ్స్ పెళ్లామ్స్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా వ‌ర్క్ అవుట్ కాక‌పోవ‌టంతో త‌రువాత ద‌ర్శ‌క‌త్వనికి దూర‌మ‌య్యారు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ సినీరంగంతో అనుబందాన్ని కొన‌సాగిస్తున్న ఆయ‌న అర్థాంత‌రంగా త‌నువు చాలించ‌టం తెలుగు సినీ క‌ళామ‌త‌ల్లికి తీర‌నిలోటు.  
« PREV
NEXT »

No comments

Post a Comment