తాజా వార్తలు

Friday, 25 December 2015

బలం లేకున్న బరిలోకి దింపుతారా..

శాసనమండలికి స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బలం లేకున్నా అభ్యర్థులను పోటీలో నిలిపిందని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఫిరాయింపుదారులు, పెట్టుబడి దారులనే నమ్ముకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దొడ్డిదారిన ఎమ్మెల్సీలను గెలుచుకోవాలని భావిస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ తరపున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారు ఫిరాయింపుదారులేనని చెప్పారు. ఇప్పటికే అధికార దుర్వినియోగానికి పాల్పడి 6 స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment