తాజా వార్తలు

Friday, 18 December 2015

రోజాపై ఏడాది వేటు

శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు.. రోజాను సభ నుంచి ఏడాది పాటు  సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం సభ నుంచి బయటకు వచ్చిన రోజా.. మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు ప్రయత్నించగా మార్షల్స్అడ్డుకున్నారు. ఆమె కన్నీళ్లు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. రోజాపై సస్పెన్షన్ వేటు వేయడంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సభలో ఆగ్రహం వ్యక్తంచేశారు. రోజాను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని నిరసన తెలియజేశారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాటలోనే మంత్రులు, ఇతర నాయకులు నడుస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకుల్ని  తిట్టడమే లక్ష్యంగా చెలరేగుతున్నారు. చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయడానికి విపక్షాన్ని తిట్టడమే ఏకైక మార్గంగా భావిస్తున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ మహిళా ఎమ్మెల్యే అనిత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల మీద మాటల దాడి చేశారు. వైఎస్సార్సీపీ మహిళా సభ్యురాలు రోజా మీద ఏడాది పాటు సస్పెన్షన్ విధించాలని డిమాండ్ చేశారు. వ్యవహారాన్ని పక్క దారి పట్టించేందుకు మార్గాలు వెదకుతున్న చంద్రబాబు అండ్ కో దాన్ని పక్కాగా అమలు చేశారు. వెంటనే దీన్ని ఆచరణలోకి తెచ్చి చూపించారు
« PREV
NEXT »

No comments

Post a Comment