తాజా వార్తలు

Saturday, 12 December 2015

రుచితకు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డు

మెదక్ జిల్లా మాసాయిపేట దగ్గర రైలు-స్కూల్ బస్సు ప్రమాదం సాహసోపేతంగా విద్యార్థులను కాపాడిన చిన్నారి రుచిత ప్రతిష్టాత్మక జాతీయ సాహసబాలల అవార్డుకు ఎంపికైందిజనవరి 26 ఢిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకల్లో రుచిత రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకోనుంది.  అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి చిన్నారుల ప్రాణాలను కాపాడిన రుచితను రాష్ట్రపతి ప్రణబ్ లేఖలో అభినందించారుతోటి పిల్లల ప్రాణాలను కాపాడిన చిన్నారి రుచిత అవార్డుకు ఎంపికవడంపై ఆమె తల్లిదండ్రులతోపాటు గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
  మాసాయిపేట రైల్వే గేటు వద్ద జరిగిన రైలు ప్రమాదంలో డ్రైవరుక్లీనర్తో సహా 18 మంది మృతి చెందారు.  రుచిత దుర్ఘటన సమయంలో రైలు ఢీకొన్న బస్సు కిటికీలో నుంచి సద్బావన్దాస్మహిపాల్రెడ్డి అనే పిల్లలను బయటకు తోసేసి తాను కూడా దూకి ప్రాణాలను కాపాడుకుంది. ఇద్దరు పిల్లల ప్రాణాలను కాపాడి ధైర్యసాహసాలను ప్రదర్శించినందుకు రుచిత పలువురి ప్రశంసలు అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం బాలికకు సాహస అవార్డును ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. నేపథ్యంలో రాష్ట్రపతి కార్యాలయం నుంచి రుచితకు సాహసబాలల అవార్డుకు ఎంకికైనట్లు లేఖ అందింది. రుచితను రాష్ట్రపతి అవార్డు వరించడంపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  


« PREV
NEXT »

No comments

Post a Comment