తాజా వార్తలు

Thursday, 10 December 2015

కేసులన్నీ కొట్టివేత, సల్లూభాయ్ సేఫ్

హిట్ అండ్ రన్ కేసులో నిర్దోషిగా తేలడంతో సల్మాన్ ఖాన్ కన్నీళ్లు పెట్టాడు. ముంబై హైకోర్టులో కుటుంబసభ్యుల ముందు కన్నీటి పర్యంతమయ్యాడు. కోర్టు తీర్పు సమయంలో సల్మాన్ చుట్టూ కుటుంబసభ్యులు చేరుకున్నారు. ఈ కేసులో సల్మాన్‌పై ఉన్న అన్ని కేసులను కొట్టివేశారు. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్‌కు వ్యతిరేకంగా ఆధారాలను ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్ దారుణంగా విఫలమైందని కోర్టు తేల్చి చెప్పింది. ముఖ్యంగా బార్ బిల్లును ప్రవేశపెట్టడంలో విఫలమైందని హైకోర్టు పేర్కొంది. మద్యం తాగిన మత్తులో సల్మాన్ ఓ పేవ్‌మెంట్‌పై పడుకున్న అయిదుగురు మీద నుంచి కారును నడిపినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నరు. ఆ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. సల్మాన్ కోర్టుకు రావాలంటూ న్యాయమూర్తి కోరిన సందర్భంలో అతను ముంబై హైకోర్టులో హాజరయ్యారు. 13 ఏళ్లుగా కొనసాగిన హిట్ అండ్ రన్ కేసులో ఇవాళ తీర్పు వెలువడింది. 
« PREV
NEXT »

No comments

Post a Comment