తాజా వార్తలు

Friday, 4 December 2015

బెయిల్ రద్దు పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

హిట్  రన్  కేసులో భాగంగా బాలీవుడ్  హీరో సల్మాన్  ఖాన్  బెయిల్ రద్దు పిటషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. గత మే నెలలో 2002 నాటి హిట్  రన్  కేసును విచారించిన ముంబై సెషన్స్  కోర్టు... సల్మాన్  ను దోషిగా తేల్చింది. ఐతే అదే రోజు ముంబై హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూర్ చేసింది. దీంతో సల్మాన్  బెయిల్ రద్దు కోరుతూ కేసులో కీలక సాక్షిగా ఉండి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన రవీంద్రసింగ్ తల్లి సుప్రీంకోర్టులో పిటిషన్  వేసింది. పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
« PREV
NEXT »

No comments

Post a Comment