తాజా వార్తలు

Sunday, 13 December 2015

విజయవాడలో శోభన్ బాబు కాంస్య విగ్రహం

విజయవాడలో నటుడు శోభన్‌బాబు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. శోభన్‌బాబు అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నటుడు, ఎంపీ మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శోభన్‌బాబు మంచి క్రమశిక్షణ ఉన్న నటుడన్నారు. శోభన్‌బాబుతో తనకున్న అనుబధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో నటించడం మానేసి పదేళ్లయినా..మరణించినా ఆయనను మరిచిపోలేని అభిమానులుండటం ఎంతో గొప్ప విషయమన్నారు. టాలీవుడ్ సోగ్గాడిగా పేరొందిన శోభన్‌బాబు ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment