తాజా వార్తలు

Wednesday, 2 December 2015

అగ్రదేశం లో కాల్పులు- 20 మంది మృతి

అమెరికాలో మరో ఘోరం జరిగింది.అది తుపాకి సంస్కృతి సమస్యో , లేక ఉగ్రవాదుల వల్ల జరిగిందో కాని కాల్పుల లో ఇరవై మంది మరణించినట్లు సమాచారం వస్తోంది. కాలిఫోర్నియాలో శాన్ బెర్నార్డియో ప్రాంతంలోని వాటర్ మాన్ అవెన్యూలో ఈ ఘోరం జరిగింది. ముగ్గురు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. వారి వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నాయని చెబుతున్నారు. కొందరు ప్రజలు నేల మీద పడుకుని ఉండడం, క్షతగాత్రులకు పోలీసులు సాయం అందించడం వంటి దృశ్యాలను చూశామని స్థానికులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఇది పెద్ద ఘటనగా చెప్పవచ్చు.పూర్తి వివరాలు రావల్సి ఉంది.బుధవారం నాడు ఈ ఘటన జరిగింది.
« PREV
NEXT »

No comments

Post a Comment