తాజా వార్తలు

Wednesday, 23 December 2015

కాలకేయతో జతకట్టిన స్మిత

పాప్ సింగర్  స్మిత మరో సరికొత్త ప్రైవేట్ సాంగ్ తో వచ్చేసింది. బాహుబలి సినిమాలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కిళికి భాషలో  ప్రైవేట్ సాంగ్‌ను రిలీజ్ చేసిందిగతంలో ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్‌తో ఆకట్టుకున్న స్మిత  'బాహ కిళికిఅనే పేరుతో సాంగ్‌ను రూపొందించింది. బాహుబలి చిత్రంలో కాళకేయుడుగా అలరించిన ప్రభాకర్ పాటలోను అదే లుక్‌తో కనిపించారు. అయితే పాటను స్మిత బాహుబలి టీంకు ట్రిబ్యూట్‌గా ఇవ్వనున్నట్టు తెలుస్తోందిబాహ కిలికి అనే పేరుతో రూపొందిన పాటకు దేవ కట్టా కాన్సెప్ట్ అందించగా, అచ్చు సంగీతాన్ని అందించారు. ఇక మధన్ కార్కీ లిరిక్స్‌ను అందించగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment