తాజా వార్తలు

Sunday, 27 December 2015

సోగ్గాడే చిన్నినాయనా అంటున్న నాగ్

అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ లో క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున‌ర‌మ్య‌కృష్ణ‌లావ‌ణ్య‌త్రిపాఠి హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న‌ చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. అనూప్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం శుక్ర‌వారం హైద‌రాబాద్ లోని శిల్ప‌క‌ళావేదిక‌లో జ‌రిగింది. ఆడియో సీడీల‌ను ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘవేంద్రరావు విడుద‌ల చేసితొలి సీడీని నాగార్జున‌కు అందించారు. ఈ సంద‌ర్భంగా...నాగార్జున మాట్లాడుతూ..`దేవుడు నాకు అన్నీ అడ‌క్కుండానే ఇచ్చాడు. వాటిలో అభిమానులు కూడా ఉన్నారు. అన్న‌పూర్ణ సంస్థ త‌ర‌పున మిమ్మ‌ల్ని క‌లిసి రెండు సంవ‌త్స‌రాలు అవుతుంది. మా బ్యాన‌ర్ లో మ‌నం సినిమాను చేశాం. ఆ సినిమాలో నాన్న‌నేను అంద‌రం క‌ల‌సి న‌టించాం. మాకు దూర‌మైన నాన్న‌గారు మ‌నం సినిమాతో అంద‌రికీ ద‌గ్గ‌ర‌య్యారు. మ‌నం సినిమా త‌ర్వాత ఆ సినిమా పరువు నిల‌బెట్టేలా ఎలాంటి సినిమా చేయాలి అని ఆలోచించి చేసిన సినిమానే `సోగ్గాడే చిన్ని నాయ‌నా`. నాన్న‌గారు  అనురాగంఅత్మీయ‌త‌అనుబంధాలు,ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం ఇలాంటి సినిమాల‌నే చేసి ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. అలాంటి సినిమాకు హ‌లోబ్ర‌ద‌ర్ లాంటి ఎంట‌ర్‌ట్‌న్‌మెంట్‌ను యాడ్ చేస్తే ఎలా ఉంటుందోన‌ని ఆలోచ‌న‌తో ఈ సినిమా చేశాం. తెలుగువారికి ఇష్ట‌మైన పండుగ సంక్రాంతి. ప‌చ్చ‌ద‌నంతియ్య‌ద‌నం అన్నీ క‌లిసి ఉంటాయి. అలాగే ఈ చిత్రంలో కూడా అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. అన్న‌పూర్ణ సంస్థ ఎప్పుడూ కొత్త‌వాళ్ల‌ని ఎంక‌రేజ్ చేస్తుంటుంది. మంచి క‌థతో నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తే నేను వారికి అండ‌గా ఉంటాను. క‌ళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు. చాలా కొత్త డైలాగ్స్ నాతో చెప్పించాడు. ఉయ్యాల జంపాల రామ్మోహ‌న్ గారు ఇచ్చిన క‌థ‌ను డెవ‌ల‌ప్ చేసి ఈ సినిమా చేశాడు. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నాలుగు మచి సాంగ్స్ ఇచ్చాడు. సంక్రాంతికి వ‌స్తున్నాం...కొడుతున్నాం`` అన్నారు. `టీజ‌ర్స్‌సాంగ్స్ బావున్నాయి. నాన్న‌గారు 25 సంవ‌త్స‌రాల క్రితం ఉన్న ఎన‌ర్జీతో న‌టించారని చైతన్య అన్నారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment