తాజా వార్తలు

Tuesday, 22 December 2015

స్పేస్-ఎక్స్ అద్భుత విజయం

రాకెట్ ప్రయోగాల్లో అమెరికాకు చెందిన స్పేస్-ఎక్స్ కంపెనీ అద్భుత విజయాన్ని సాధించింది.  ఫాల్కన్‌న-9 రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపి మళ్లీ అదే రాకెట్‌ను సక్సెస్‌ఫుల్‌గా నేలపై దిగేలా చేసింది. ఆ అద్భుత ఘట్టం ఫ్లోరిడాలోని కేప్ కెనరవల్‌లో చోటుచేసుకుంది. గతంలో మూడుసార్లు ఈ ప్రయోగాల్లో విఫలమైన స్పేస్ ఎక్స్ ఈ సారి మాత్రం అసాధారణ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజా రాకెట్ ఒరాకోంబ్ నెట్‌వర్క్ కోసం సుమారు 11 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. ఆ తర్వాత నేలపై దిగేందుకు ఆ రాకెట్‌కు వాతావరణం కొంత వరకు సహకరించలేదు. కానీ చివరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ రాకెట్ భూమిపై సురక్షితంగా దిగింది. ఫాల్కన్-9 రాకెట్ ధర సుమారు 60 నుంచి 90 మిలియన్ డాలర్లు ఉంటుందని స్పేస్ ఎక్స్ పేర్కొంది.  
« PREV
NEXT »

No comments

Post a Comment