తాజా వార్తలు

Sunday, 6 December 2015

పొగమానేయడం అంత కష్టమేమీ కాదు

పొగతాగడం అలవాటు మానుకోవడం చాలా మందికి కష్టంగానే ఉంటుంది. పొగాకులో ఉండే నికొటిన్ వల్ల బీపీ పెరుగుతుంది, ఊపిరితిత్తులకు చాలా హాని చేస్తుంది. పొగతాగడం ఆపేసినప్పటికీ నికోటిన్ ప్రభావం చాలా సంవత్సరాల వరకు ఆరోగ్యం మీద ఉంటుంది.
-శరీరంలో ఉన్న నికోటిన్ను బయటకు పంపేందుకు జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా దారి సుగమం చేసుకోవచ్చు. కొన్ని రకాల ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల నికొటిన్ నుంచి విముక్తి పొందవచ్చు.
-నారింజ - నారింజ రసంలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా పొగమానిన వారికి మంచి ఫలితాలను ఇస్తుంది
-పాలకూర - పాలకూర చాలా ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పవచ్చు. ఇందులో విటమిన్లు మాత్రమే కాదు, ఫోలిక్ ఆసిడ్ కూడా పుష్కలంగా ఉంటుంది.
-కివి - శరీరం నుంచి నికోటిన్ను బయటకు పంపడంలో కివి పాత్ర అద్భుతమైనది. ఇందులో విటమిన్ , సి, అత్యధికంగా ఉంటాయి. పొగతాగడం వల్ల వీటి లోపం ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
-నీళ్లు- పొగతాగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీ హైడ్రేట్ అవుతుంది. అందువల్ల పొగ మానేసినా కూడా నికొటిన్ను త్వరగా బయటకు పంపేందుకు తప్పనిసరిగా నీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది.
-బ్రకోలి - ఇందులో విటమిన్లు సిబి ఎక్కువగా సమృద్ధిగా ఉంటాయిపొగతాగడం వల్ల శరీరంలో విటమిన్ సి స్థాయి పడిపోతుందిపొగ మానేసిన తర్వాత ఎక్కువగా బ్రకోలి తీసుకోవడం ద్వారా దాన్ని తిరిగి శరీరానికి అందించడమే కాకుండా నికోటిన్ నుంచి విముక్తి కూడా పొందవచ్చు
క్యారెట్ రసంఒక్కసారి పొగ తాగితే  పొగ ద్వారా శరీరంలో చేరిన నికోటిన్ మూడు రోజుల వరకు ఉంటుందినికొటిన్ ప్రభావం చర్మం మీద కూడా ఉంటుందిక్యారెట్ రసం చర్మ ఆరోగ్యానికి చాలా మంచిదిఇందులో విటమిన్లు సికెబి లు అధికంగా ఉంటాయిఇవ్వన్నీ కూడా శరీరంలోని నికొటిన్ను బయటకు పంపడానికి దోహదం చేస్తాయి
« PREV
NEXT »

No comments

Post a Comment