తాజా వార్తలు

Wednesday, 9 December 2015

త్వరలో పాకిస్తాన్ లో మోడీ పర్యటన- సుష్మాస్వరాజ్

పాకిస్తాన్ లో త్వరలో భారత ప్రధాని నరేంద్రమోదీ అడుగుపెట్టనున్నారని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్  తెలిపారు. వచ్చే ఏడాది పాకిస్థాన్ లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు.  ఆసియా దేశాల ప్రాంతీయ సదస్సు 'హార్ట్ ఆఫ్ ఆసియా' కారక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం సుష్మాస్వరాజ్ ఇస్లామాబాద్‌  వెళ్లిన విషయం తెలిసిందే. అదే రోజు కార్యక్రమం కూడా ప్రారంభమైంది. పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ 5వ సదస్సులో 14 సభ్య దేశాలు, 17 మిత్రదేశాలు, 12 అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థలు పాల్గొంటున్నాయి. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వం వహిస్తున్నారు. పాకిస్థాన్ లో దక్షిణాసియా దేశాల శిఖరాగ్ర సదస్సు(సార్క్) జరగనుందని దీనికి మోదీ హాజరవుతారని ఆమె తెలిపింది. ఇదే జరిగితే 2004 తర్వాత భారత్ నుంచి పాకిస్థాన్ ను సందర్శించనున్న తొలి ప్రధాని నరేంద్రమోదీ అవుతారు. అంతకుముందు 2004లో అటల్ బీహారీ వాజపేయి పాక్ ను ఇదే సార్క్ సదస్సు పేరిట సందర్శించారు. మోదీ పర్యటనలో ఆయనతోపాటు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఉంటారు.
« PREV
NEXT »

No comments

Post a Comment