తాజా వార్తలు

Wednesday, 30 December 2015

సిరియాలో ఉగ్రదాడులు, 16 మంది మృతి

సిరియాలో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వరుస బాంబుదాడులతో చెలరేగారు. ఈ దాడుల్లో 16 మంది మృతి చెందగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. సిరియా ఈశాన్య ప్రాంతంలోని క్వామిష్లీ పట్టణంలోని మూడు రెస్టారెంట్ లు లక్ష్యంగా దాడులు జరిగాయి. రెస్టారెంట్ లోపల జరిగిన ఓ ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఘటనకు బాధ్యులం తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించినట్లు అమాక్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఇరాక్, టర్కీ సరిహద్దు ప్రాంతంలో ఉన్న క్వామిష్లీ పట్టణం భద్రతా బలగాల ఆదీనంలో ఉంది. అయితే ఇక్కడ స్వయం పాలనను ప్రకటించుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తరచు దాడులకు పాల్పడుతోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment