తాజా వార్తలు

Wednesday, 2 December 2015

కాంగ్రెస్, టీడీపీలకు షాక్

 జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గులాబీ ఆకర్ష్‌ కొనసాగుతుంది. గురువారం టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన ఇద్దరు నేతలు సాయన్న (ఎమ్మెల్యే), ప్రభాకర్‌ (ఎమ్మెల్సీ)లు టీఆర్‌ఎస్‌ తీర్థం తీసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీఆర్‌ఎస్‌లో చేరానని ఎమ్మెల్యే సాయన్న చెప్పారు. గురువారం కేసీఆర్‌ సమక్షంలో ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఎంఎస్‌ ప్రభాకర్‌లు టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం సాయన్న మీడియాతో మాట్లాడారు. తాను టీటీడీ బోర్డు పదవికి రాజీనామా చేస్తామని సాయన్న ప్రకటించారు. కాగా టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని గతంలో ఎంఎస్‌ ప్రభాకర్‌ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ప్రభాకరే టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించడం విశేషం.
« PREV
NEXT »

No comments

Post a Comment