తాజా వార్తలు

Friday, 11 December 2015

బాలయ్య సినిమాకు చెన్నైవరదల కష్టాలు

బాలయ్యబాబు డిక్టేటర్ కు చెన్నై వరదల ముప్పు పరోక్షంగా నష్టం కల్గిస్తున్నది. ఈ ప్రకృతి వైపరిత్యం కోలీవుడ్ సినీ పరిశ్రమకు కూడా తీరని నష్టాన్ని మిగిల్చింది. వరదల వలన అక్కడి థీయేటర్లు, స్టూడియోలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 
 ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కాని తాజాగా థమన్ నుండి పెద్ద ప్రాబ్లమ్ వచ్చి పడింది. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, ఇటీవల వచ్చిన వరదలకు ఈయన మ్యూజిక్ స్టూడియో పూర్తిగా దెబ్బతింది. దీంతో థమన్ కు దాదాపు మూడున్నర కోట్ల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. థమన్ తన స్టూడియోను తిరిగి నిర్మించుకోవడానికి కనీసం ఒక నెల సమయం పడుతుందని చెబుతుండగా, డిక్టేటర్ ను సంక్రాంతి బరిలోనే నిలపాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి రేసులో బాలయ్యబాబు నిలుస్తాడో లేదో..చూడాలి మరి...
« PREV
NEXT »

No comments

Post a Comment