తాజా వార్తలు

Wednesday, 2 December 2015

చెన్నపట్నం ఛిన్నాభిన్నం

వర్షాలు చెన్నై నగరాన్ని వణికిస్తున్నాయి. ఇంకా కురుస్తున్న భారీ వర్షాలతో జనం వణికిపోతున్నారు. సిటీలో వరదలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి వరదల్లో చిక్కుకున్న మరో 20వేల మందిని రెస్క్యూ సిబ్బంది .. సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు 50 కిలోమీటర్ల పరిధిలో చెన్నై నగరం తీవ్రంగా నష్టపోయింది. అవడి, పొన్నిమల్లై బ్రిడ్జిలు కూలిపోయాయి. వీఐపీలు ఉండే రెడ్ హిల్స్.. ప్రాంతం ఇంకా వరద నీటిలోనే ఉంది. గత మూడు రోజులుగా కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా పనిచేయకుండాపోయింది. విద్యుత్ వ్యవస్థ దెబ్బతినటంతో.. రాత్రి వేళల్లో ప్రజలు చీకట్లోనే ఉండాల్సి వస్తోంది. చెన్నైలో ప్రస్తుత పరిస్థితిక అద్దంపడుతోంది ఇక్కడున్న ఇమేజ్. మూడు నాలుగు వారాలుగా కురుస్తున్న వర్షాలకు బ్రిడ్జ్ కూడా మునిగిపోయింది.
« PREV
NEXT »

No comments

Post a Comment