తాజా వార్తలు

Friday, 4 December 2015

తిరుమల రెండో ఘాట్ రోడ్డ సిద్ధం

తిరుమలో రెండో ఘాట్ రోడ్డులో మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి రెండు ఘాట్ రోడ్డను అందుబాటులోకి రానున్నాయి. రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదకర ప్రాంతాలను ముందుగా గుర్తించి... నిపుణులచే మరమ్మతులు చేయిస్తామన్నారు టీటీడీ ఈవో డి.సాంబశివరావు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం తిరుమలలో ఈవో డి.సాంబశివరావు విలేకర్లతో మాట్లాడుతూ... ఈ పర్వదినాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ బ్రహ్మోత్సవాలు 16వ తేదీతో ముగుస్తాయన్నారు. 16వ తేదీన తిరుచానురులో పంచమి తీర్థం నిర్వహిస్తామని సాంబశివరావు పేర్కొన్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment