తాజా వార్తలు

Wednesday, 2 December 2015

రజనీకాంత్ తో ఫ్రీగా నటిస్తా..

రజనీకాంత్‌తో కలిసి నటించే అవకాశం మాత్రం రాలేదని త్రిషా తెగబాధపడిపోతుందట. రజనీకాంత్ తో నటించే అవకాశం వస్తే ఫ్రీగా నటించేస్తానని కూడా అంటుందని ఫిల్మ్ నగర్ టాక్. తన జీవితంలో అది తీరని కోరికగా మిగిలిపోతుందేమోనని సన్నిహితుల వద్ద బాధపడుతోందట. గతంలో సూపర్‌స్టార్‌తో జతకట్టే అవకాశం వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో చేజారింది. రజనీకాంత్‌తో ఒక్క సినిమా చేస్తే చాలు తన కెరీర్‌కు పరిపూర్ణత లభిస్తుందని అనుకుంటున్న త్రిష ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిందట. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న రోబో-2 త్వరలో ప్రారంభంకానుంది. ఇందులో ఓ కథానాయికగా అమీజాక్సన్‌ను ఎంపికచేశారు. మరో నాయిక వేటలో చిత్రబృందం వున్నట్లు తెలిసింది. ఈ స్థానంపై త్రిష ఆశలు పెట్టుకుందని చెన్నై సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో అవకాశమిస్తే పారితోషికం గురించి కూడా ఆలోచించనని తెగేసి చెబుతోందట.  
« PREV
NEXT »

No comments

Post a Comment