తాజా వార్తలు

Sunday, 27 December 2015

నిబంధనల్లో వేడుకలు

నూతన సంవత్సర వేడుకల కార్యక్రమాలకు రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతులు ఇస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎలాంటి నిబంధనలను పాటించికపోయిన వారిపై సెక్షన్ 133 సీఆర్‌పీసీ కింద కేసులను నమోదు చేసి వారి ప్రాంతాన్ని సీజ్ చేస్తామని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. అదే విధంగా వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆ రోజు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహిస్తామన్నారు. సైబరాబాద్ పరిధిలో ఉన్న పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే, ఫ్లైఓవర్లు, ఔటర్ రింగ్‌రోడ్డులపై డిసెంబరు 31వ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకలకు నిషేధించారు. 

న్యూఇయర్ వేడుకలుకు నిబంధనలివీ..
 •  31న కార్యక్రమాలను రాత్రి 8 గంటల నుంచి ఒంటిగంట వరకు నిర్వహించాలి.
 •  ఈ కార్యక్రమాలకు వచ్చే ప్రేక్షకుల సామర్థ్యాం వివరాలను ముందుగానే పోలీసులకు తెలపాలి. ఇన్విటేషన్ ఉంటేనే అనుమతిని ఇవ్వాలి.
 •  రిజిస్టర్ చేసుకున్న జంటలు వారి కుటుంబసభ్యులను మాత్రమే అనుమతించాలి.ఒంటరిగా వచ్చే వారిని అనుమతించకూడదు.
 •  సీపీ సైబరాబాద్ నుంచి అనుమతి రాకుండా ముందస్తుగా వేడుకలకు సంబంధించిన పోస్టర్లను 
 • బహిరంగ ప్రదేశాల్లో ప్రకటనల పోస్టర్లు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేయొద్దు.
 •  వేడుకల్లో గేమింగ్ వంటి కార్యక్రమాలను నిర్వహించొద్దు. 
 • డీజేలకు అనుమతి లేదు. సౌండ్ బాక్సుల శబ్ధం కూడా 45 డెసిబుల్స్ స్థాయి మించకూడద్దు. 
 • డీజే అవసరమనుకున్న వారు స్థానిక ఎస్‌హెచ్ లేదా ఏసీపీ నుంచి అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి.
 •  ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు అశ్లీల పోస్టర్లు, ఫిలింలను ప్రదర్శించవద్దు.అశ్లీల నృత్యాలు నిషేధం. 
 •  వేడుకల ప్రచారం కోసం అర్ధనగ్న చిత్రాలతో ప్రకటనలను చేయరాదు.
 •  ఎక్సైజ్ శాఖ నుంచి సరైన అనుమతి లేనిదే వేడుకల్లో మద్యాన్ని ఇవ్వరాదు.
 •  ప్రజలకు ప్రమాదకరమైన పరిస్థితులను కలిగించే కార్యక్రమాలను చేపట్టవద్దు. 
 •  వేడుకల్లో తుపాకులతో రావడం నిషేధం. లైసెన్సులు ఉన్నా వాటిని వేడుక ప్రాంగణాన్ని తీసుకురావద్దు. 
 •  ఫైర్ డిపార్ట్‌మెంట్ అనుమతులు తప్పనిసరి.
 •  పోలీసులు జారీ చేసిన సమయ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.
 •  నిర్వాహకులు నియమ నిబంధనల గురించి ప్రేక్షకులకు ముందస్తుగా వివరించాలి. 
 •  ఈ వేడుకలకు సంబంధించి మొత్తం కార్యక్రమాన్ని మినిట్ టూ మినిట్ రికార్డు చేయాలి. ఈ రికార్డింగ్‌లను రెండు రోజుల తర్వాత సీపీ కార్యాలయంలో అందజేయాలి.
 •  న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించే నిర్వాహకులు కార్యక్రమాల ప్రాంగణాల్లో సీసీటీవీలు, డీఎఫ్‌ఎమ్‌డీలు, 
 • మెటల్ డిటెక్టర్‌లను తప్పని సరి. ప్రాంగణమంతా స్పష్టంగా కనపడేలా లైటింగ్‌ను పెట్టుకోవాలి. 
 •  పటాకులను కాల్చడం నిషేధం. అగ్నిప్రమాదాల నివారణకు సామగ్రితో పాటు నీళ్ళను ఉంచుకోవాలి
 •  నిబంధనల పరిశీలన కోసం స్థానిక ఇన్‌స్పెక్టర్ వేడుక ప్రాంతాన్ని ముందస్తుగా పరిశీలిస్తారు.
 •  సెలబ్రేషన్స్ సందర్భంగా ఏదైనా అపశృతులు జరిగినా, గొడవలు చోటు చేసుకున్నా అనుమతి తీసుకున్న వారు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. 
 •  ఈవెంట్‌లు జరిగే ప్రాంతాల్లో పబ్లిక్ రద్దీని కంట్రోల్ చేసేందుకు, ట్రాఫిక్ జామ్‌లు లేకుండా వాహనాలను పార్క్ చేసేందుకు ప్రైవేటు సెక్యురిటీని ఏర్పాటు చేసుకోవాలి. వాహనాలను నిలపవద్దు.
« PREV
NEXT »

No comments

Post a Comment