తాజా వార్తలు

Tuesday, 22 December 2015

తెలంగాణలో గ్రూప్ 2 నోటిఫికేషన్ ?

త్వరలో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 నోటిఫికేషన్, వచ్చే ఏడాది ఏప్రిల్ లో డీఎస్సీ నోటిఫికేషన్  వెలువడే అవకాశం ఉంది.సాధారణ డిగ్రీలు పూర్తిచేసిన వారికి ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదనే భావనను పలువర్గాలు వ్యక్తం చేశాయిమరోవైపు గ్రూప్కేటగిరీలో తక్కువ పోస్టులు ఉండటం వల్ల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ ఆలోచనలో పడిందికొలువుల భర్తీకి క్లియరెన్స్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. సీరియల్ లాగా సాగుతున్న ఉద్యోగుల విభజన పెద్దఅడ్డంకిగా మారిందిదీంతో గ్రూప్2పై ఉద్యోగార్థుల నిరీక్షణ ఇంకా కొనసాగుతూనే ఉందిమరోవైపు ఉద్యోగార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కల్పించిన పదేండ్ల వయోపరిమితి సడలింపు సౌలభ్యాన్ని  జాప్యం వల్ల ఉద్యోగార్థులు కోల్పోయే అవకాశముందిటీఎస్పీఎస్సీ ఇప్పటివరకు 9 నోటిఫికేషన్ల ద్వారా 2,626 ఉద్యోగాలకు ఆన్లైన్/రాతపరీక్షలను పూర్తిచేసింది. అయితే ఇవన్నీ ఇంజినీరింగ్, డిప్లొమా వంటి సాంకేతిక చదువులు పూర్తిచేసిన వారికి చెందినవి. బీకాం చదవిన వారికి ఒక నోటిఫికేషన్లో అవకాశం దక్కినా పోస్టుకు మరో సాంకేతిక అర్హతను జోడించారుడీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, టెట్ పరీక్ష నిర్వహణ, ఇంటర్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్‌పై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కీలక నిర్ణయాలను ప్రకటించారు. టెట్ నోటిఫికేషన్‌ను మార్చిలో, డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్స్‌లో ఈసారికి జంబ్లింగ్ పద్ధతి ఉండదని స్పష్టంచేశారు. పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్ నెలాఖరులో డీఎస్సీ-2016 నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే కొత్త ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరిగిపోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, దిశగా తక్షణమే చర్యలు మొదలుపెట్టామని తెలిపారు. సోమవారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, డైరెక్టర్ జీ కిషన్, అడిషనల్ డైరెక్టర్ గోపాల్‌రెడ్డితో ఆయన సమీక్ష నిర్వహించారు
డీఎస్సీ నోటిఫికేషన్ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డీఎస్సీ-2016 పరీక్షలను జూన్ రెండోవారంలో నిర్వహిస్తామని చెప్పారు. జూన్ నెలాఖరులోనే డీఎస్సీ ఫలితాలు విడుదల చేసి, జూలై రెండోవారంలో కౌన్సెలింగ్ నిర్వహించి, ఉద్యోగానికి ఎంపికైన వారికి వెంటనే పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేస్తామని విద్యామంత్రి కడియం తెలిపారు. మొత్తం ప్రక్రియను 75 రోజులలో పూర్తిచేయాలని నిర్ణయించామని అన్నారు. ఈలోగా టెట్ పరీక్షల నిర్వహణ కూడా పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు. టెట్‌లో అర్హత సాధించిన వారినే డీఎస్సీ-2016లో అర్హులుగా పరిగణించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్‌ను నోటిఫికేషన్‌తోపాటు విడుదల చేస్తామని వివరించారు.
 
« PREV
NEXT »

No comments

Post a Comment