తాజా వార్తలు

Sunday, 27 December 2015

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా కింద నిర్వహించిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. నాలుగు జిల్లాల్లో ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు రంగారెడ్డి జిల్లాలో 2, మహబూబ్నగర్ జిల్లాలో 2, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించారు. మొత్తంగా 12 ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడగా... ఆరు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన ఆరు స్థానాలకు ఈరోజు పోలింగ్ నిర్వహించారు. ఈనెల 30 ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment